: కేసీఆర్ ను ఎందుకు ఆహ్వానించామంటే..: చంద్రబాబు


"ప్రభుత్వాలు వేరు. తెలుగు జాతి అంతా ఒకటే. సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. విభజన సమయంలో ఎలాగూ నష్టపోయాం. ఇప్పడు విభేదాలు చూపుకుంటూ ముందుకెళ్లడం ద్వారా రెండు రాష్ట్రాలకూ నష్టమే. సానుకూల దృక్పథంతో వెళ్లాలన్నదే నా కోరిక. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను శంకుస్థాపన ఉత్సవాలకు ఆహ్వానించాను. తెలంగాణకు ఇచ్చింది తిరిగి ఇవ్వాలని నేను ఎన్నడూ కోరలేదు. విభజన తరువాత ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేయాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నాను" అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తెలంగాణకు నష్టం చేయాలన్న ఉద్దేశం తనకేమాత్రమూ లేదని స్పష్టం చేశారు. అమరావతికి రావాలని కేసీఆర్ దగ్గరకు పిలుపులకు వెళ్లిన సమయంలో రెండు ప్రభుత్వాలూ అభివృద్ధి దిశగా ఎలా ముందుకు సాగాలన్న విషయాన్నే ప్రధానంగా చర్చించినట్టు చంద్రబాబు తెలిపారు.

  • Loading...

More Telugu News