: పదేళ్ల ప్రధానిని మట్టికరిపించిన కెనడా వాసులు


కెనడాలో జరిగిన ఎన్నికల్లో పదేళ్ల పాటు దేశాన్ని పరిపాలించిన కన్జర్వేటివ్ పార్టీ నేత స్టీఫెన్ హార్పర్ ఘోర పరాజయాన్ని పొందారు. విపక్ష లిబరల్ పార్టీకి అనూహ్య విజయం లభించగా, మాజీ ప్రధాని పియరీ ట్రూడో కుమారుడు జస్టిన్ ట్రూడో నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తం 338 స్థానాలకు ఎన్నికలు జరుగగా, 184 సీట్లలో లిబరల్ పార్టీ నిలిపిన అభ్యర్థులు గెలిచి ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీని అందించారు. ఈ సందర్భంగా మాంట్రియల్ లో భారీ విజయోత్సవ ర్యాలీ జరుగగా, అభిమానులు, ప్రజల కేరింతల మధ్య ట్రూడో ప్రసంగించారు. కెనడా తిరిగి ఒకప్పటి దేశంగా నిలిచి ప్రపంచపటంలో తలెత్తుకు నిలవనుందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News