: అమరావతికి కేసీఆర్ రాకపట్ల వ్యతిరేకత!


తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అమరావతికి రావడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు యూత్ కాంగ్రెస్ వెల్లడించింది. రాష్ట్ర విభజనకు కారణమై, తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టిన కేసీఆర్ ను చంద్రబాబు ఆహ్వానించడాన్ని తప్పుబడుతూ, ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకే ఆయనకు స్వాగతం పలుకుతున్నారని కాంగ్రెస్ నేత దేవినేని అవినాష్ ఆరోపించారు. శంకుస్థాపనకు ఆయనను పిలవడాన్ని తప్పుబట్టారు. మరోవైపు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం ఇద్దరు చంద్రుల సమావేశాన్ని ఓ డ్రామాగా అభివర్ణించారు. కాగా, రేపు అమరావతి శంకుస్థాపన అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News