: నన్ను భయపెట్టింది ఒకే ఒక్క బౌలర్: సెహ్వాగ్
‘శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ అంటే నాకు భయం. ఈ బౌలింగ్ లో సాహసోపేతమైన షాట్లను ఆడాలంటే చాలా భయంగా ఉండేది. దూకుడుగా ఆడటానికి ఆలోచించే వాడిని. నా కెరీర్ లో మురళీ ఒక బెస్ట్ బౌలర్’ అని రిటైర్మెంట్ అనంతరం వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు. వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంటుంది, అందరికీ తెలిసిందే... విధ్వంసకర బ్యాటింగ్ చేస్తాడని! ఏ స్థాయి బౌలింగ్ నైనా చాలా సమయాల్లో ఫోర్ తోనో, సిక్స్ తోనో ఇన్నింగ్స్ మొదలుపెట్టేవాడు. అదే ఆటను సెంచరీ దగ్గరలో పడ్డప్పుడు కూడా కొనసాగించేవాడు.