: గొరిల్లా బర్త్ డే వేడుకలు అదిరిపోయాయి!


జపాన్ నాగోయా నగరంలోని జూకు ప్రజలు మంగళవారం బారులు తీరారు. ఎందుకనుకుంటున్నారా! జూలో జంతువులను చూడటానికి కాదు. జపాన్లోనే అందమైన మగ గొరిల్లా షాబాని 19వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు! ఈ సందర్భంగా షాబానికి ఇష్టమైన కూరగాయలతో కేకు తయారు చేశారు. దాదాపు 500 మంది ఈ బర్త్ డే వేడుకలకు హాజరయ్యారు. తాపీగా గుహ నుంచి బయటకు వచ్చిన షాబానితో కేక్ కట్ చేయించారు. కేకులోని ఓ పెద్ద భాగాన్ని షాబాని తినడంతో సందర్శకుల ఆనందానికి అంతులేకుండా పోయింది. ఈ సందర్భంగా 'హ్యాపీ బర్త్ డే టు యూ' అంటూ వారు పాట పాడారు. షాబానితో హుషారుగా గడిపిన సందర్శకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, షాబాని ఫొటోలకు ఆన్లైన్లో క్రేజ్ ఉంది. దీని ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు విపరీతంగా షేర్ చేసుకున్నారు.

  • Loading...

More Telugu News