: రజనీకాంత్ కూతురు నివాసంలో నవరాత్రి వేడుకలు
‘మా ఇంట్లో నవరాత్రి వేడుకలను ఎంతో సంతోషంగా నిర్వహించుకున్నాం. మహిళలందరం కలిసి సంప్రదాయం ప్రకారం జరుపుకున్న ఈ వేడుకలకు నా కుటుంబీకులు, స్నేహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నా సోదరి సౌందర్య అశ్విన్, నటీమణులు శ్రీదేవి విజయ్ కుమార్, ప్రీతి విజయ్ కుమార్, మరికొంతమంది వచ్చారు’ అని ప్రముఖ నటుడు రజనీకాంత్ కుమార్తె, దర్శకురాలు ఐశ్వర్య ధనుష్ ట్వీట్ చేశారు. నవరాత్రి వేడుకలకు సంబంధించి దిగిన ఫొటోలను కూడా ఆమె పోస్ట్ చేశారు.