: ట్యాంకుబండ్ పై సద్దుల బతుకమ్మ వేడుకలు


హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై సద్దుల బతుకమ్మ ప్రధాన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ఎల్ఈడీ బెలూన్లను ఎగురవేశారు. ఎల్బీ స్టేడియం నుంచి బతుకమ్మల ఊరేగింపు ట్యాంకు బండ్ కు చేరుకుంది. ఈ ఉత్సవాల్లో మహిళల ఆటపాటలు, కోలాటాలు, కళాకారుల ప్రదర్శనలతో ట్యాంక్ బండ్ కళకళలాడింది. విద్యుత్ దీపాలతో ఆ ప్రాంతమంతా వెలిగిపోయింది. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 'తంగేడు వనం' పుస్తకాన్ని పద్మాదేవేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News