: చిక్కుల్లో లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా
టీమిండియా లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా చిక్కుల్లో పడ్డారు. ఒక మహిళపై అమిత్ మిశ్రా దాడికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు బెంగళూరులోని అశోక్ నగర్ పోలీసు స్టేషన్ లో గత సెప్టెంబర్ 27వ తేదీన బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై పోలీసుల విచారణ అనంతరం అమిత్ మిశ్రాకు నోటీసులు పంపారు. గత నెల 25వ తేదీన మిశ్రా గదిలో తాను ఉండగా ఈ సంఘటన జరిగిందని అమిత్ మిశ్రాకు ఫ్రెండ్ అని చెబుతున్న ఆ మహిళ ఆరోపించింది. గత నెలలో టీమిండియా బెంగళూరు ట్రయినింగ్ క్యాంపుకు వెళ్లిన సందర్భంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో అమిత్ మిశ్రా ఆడుతున్నాడు.