: కేజ్రీవాల్ నివాసం ముందు మహిళా కాంగ్రెస్ ధర్నా
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ముందు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మహిళలు, చిన్నారులు ప్లకార్డులు పట్టుకుని బైఠాయించారు. మహిళలపై జరుగుతున్న దాడుల విషయమై ఆప్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందంటూ మహిళా కార్యకర్తలు ఆరోపించారు. ఆందోళనా కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బర్ఖా సింగ్, శర్మిష్టా ముఖర్జీ పాల్గొన్నారు. ఇదిలా ఉంచితే, దేశ రాజధాని ఢిల్లీలో ఈమధ్య కాలంలో మహిళలపై జరుగుతున్న దాడుల సంఖ్య పెరిగిపోతోంది. ఇటీవల ఢిల్లీలో ఇద్దరు బాలికలపై అత్యాచారం జరిగింది. ఈ కేసుల్లో నిందితులు ఇద్దరు టీనేజర్లు. ఈ సంఘటనపై స్పందించిన కేజ్రీవాల్ నిన్న విలేకరులతో మాట్లాడుతూ, అత్యాచార ఘటనల్లో నిందితుడిని జువెనైల్ గా పరిగణించే వయస్సును 15 ఏళ్లకు తగ్గించాలని ఆయన అభిప్రాయపడ్డారు.