: చమురు కంపెనీలకు భారీ నష్టాలు... లార్జ్ కాప్ కన్నా చిన్న కంపెనీలకు లాభాలు


ఆయిల్ సెక్టారుతో పాటు స్టీల్, వాహన రంగాల్లోని కంపెనీలు భారీగా నష్టపోవడంతో ఒడిదుడుకుల మధ్య సాగిన సూచికలు చివరికి నష్టాల్లో ముగిశాయి. మధ్యాహ్నం తరువాత ఆసియా మార్కెట్ల సరళి ఇన్వెస్టర్ల సెంటిమెంటును హరించివేసిందని నిపుణులు వ్యాఖ్యానించారు. మంగళవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ 58.09 పాయింట్లు పడిపోయి 0.21 శాతం నష్టంతో 27,306.83 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక నిఫ్టీ 13.40 పాయింట్లు తగ్గి 0.16 శాతం నష్టంతో 8,261.65 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.69 శాతం, స్మాల్ క్యాప్ 0.77 శాతం పెరిగాయి. ఎన్ఎస్ఈ-50లో టాటా పవర్, పవర్ గ్రిడ్, టీసీఎస్, ఇన్ఫోసిస్ తదితర కంపెనీలు లాభపడగా, వీఈడీఎల్, కెయిర్న్ ఇండియా, టాటా స్టీల్, హిందాల్కో, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర కంపెనీలు నష్టపోయాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,00,44,490 కోట్లుగా ఉంది.

  • Loading...

More Telugu News