: ఆడీ ఎస్5 స్పోర్ట్స్ బ్యాక్ కారు విడుదల
స్పోర్ట్స్ కార్లను ఇష్టపడే వారి కోసం కొత్త మోడల్ ఎస్5 స్పోర్ట్స్ బ్యాక్ కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది ఆడీ కార్ల తయారీ సంస్థ. ఢిల్లీ ఎక్స్ షోరూం ధర రూ. 62.95 లక్షలు అని ఆడీ ఇండియా హెడ్ జో కింగ్ తెలిపారు. ఫీచర్ల విషయానికొస్తే, ఐదు డోర్లు ఉన్న కూపె మోడల్ లో ఉండే ఈ కారు గంటకు 250 కిలోమీటర్ల అత్యధిక వేగాన్ని అందుకుంటుంది. దీంతో పాటు మరిన్ని అడ్వాన్స్ డ్ ఫీచర్లు ఎస్5 స్పోర్ట్స్ బ్యాక్ లో ఉన్నాయి.