: వెలిగిన నిరంతర సంకల్ప జ్యోతి
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలన్న ఆకాంక్షతో నిరంతర సంకల్ప జ్యోతి వెలిగింది. ఈ మధ్యాహ్నం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంకల్ప జ్యోతిని వెలిగించారు. ఈ నెల 22న శంకుస్థాపన ముగిసేవరకూ ఈ జ్యోతి నిరంతరాయంగా వెలగనుంది. జ్యోతి ఆరిపోకుండా చూసే బాధ్యతలను ఉద్ధండరాయుని పాలెం మహిళలకు అప్పగించారు. శంకుస్థాపన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో పరిశీలించిన ఆయన, అధికారులకు కొన్ని సూచనలు చేశారు. అమరావతికి లక్షల సంఖ్యలో ప్రజలు, ప్రముఖులు వస్తున్నందున, ఎక్కడైనా ట్రాఫిక్ జాంలు సంభవించి ముఖ్యులు ఎవరైనా ఇబ్బంది పడితే, వారికి అవసరమైన సేవలు చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు.