: ఇంధన కొరతలకు ఇదొక ప్రత్యామ్నాయం
డీజిల్ ధర పెరిగినప్పుడెల్లా సామాన్యుడి గుండె గుభిల్లు మంటుంది. ఎందుకంటే.. ఇప్పటి జీవితంలో ప్రతి వస్తువు ధరలూ... డీజిల్ ధర పెంపుదలతో ముడిపడిపోయి ఉన్నాయి మరి! అలాంటప్పుడు డీజిల్ ధరల పెరుగుదలను అదుపులో ఉంచగలిగేలా ఏ కొత్త ఆవిష్కరణ జరిగిందన్నా సరే.. మనకు ఆసక్తికరంగానే ఉంటుంది. అలాంటిదే ఎక్స్‌టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒకటి ఆవిష్కరించారు.
బ్యాక్టీరియా నుంచి డీజిల్‌ను ఉత్పత్తి చేసే ప్రక్రియను కనుగొన్నట్లు వీరు ప్రకటించారు. ఈ డీజిల్ అన్ని రకాలుగానూ ఇప్పుడు మనం వాడుతున్న డీజిల్ లాగే ఉంటుందిట. ఈ ఎక్స్‌టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ.కొలి అనే బ్యాక్టీరియాపై పరిశోధనలు అనేకం జరిపారు. పర్యవసానంగా డీజిల్ తయారీని కనుగొన్నారు. అయితే మల్టీనేషనల్ ఆయిల్ కంపెనీ షెల్.. ఈ ప్రత్యామ్నాయ ఇంధన ప్రయోగాల నిమిత్తం వీరికి సహకారం అందించడం ఇక్కడ విశేషం.