: ఆస్ట్రేలియాతో సిరీసుకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ


ఆస్ట్రేలియాతో టెస్టు సిరీసులో ఆడే 15 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే ఈ జట్టులో ఓపెనర్ గౌతమ్ గంభీర్ కు స్థానం దక్కకపోగా.. హర్భజన్ సింగ్, భువనేశ్వర్ కుమార్ లకు చోటు దక్కింది. గంభీర్ ప్లేసులో శిఖర్ ధావన్ ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాతో తొలి  రెండు టెస్టుల్లో ఆడే జట్టును బీసీసీఐ ప్రకటించింది.

భారత జట్టు: ధోనీ(కెప్టెన్), సెహ్వాగ్, శిఖార్ ధావన్, ఛతేశ్వర పుజారా, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, అశ్విన్, ప్రజ్ఞాన్ ఓజా, భువనేశ్వర్ కుమార్, అజింక్య రెహనే, మురళీ విజయ్, అశోక్ దిండా, ఇషాంత్ శర్మ. 

భారత జట్టు ఫిబ్రవరి 15 నుంచి బెంగళూరులో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఆస్ట్రేలియా జట్టు కూడా బోర్డు ప్రెసిడెంట్ ఎలెవెన్ తో ఫిబ్రవరి 11, 12 తేదీల్లోను, ఇండియా ఏ జట్టుతో 6 నుంచి 18 వరకు ప్రాక్టీస్ మ్యాచులు ఆడనుంది. 

తొలి టెస్ట్ ఫిబ్రవరి 22 నుంచి 26 వరకు చెన్నైలో, రెండో టెస్టు మార్చి 2 నుంచి 6 వరకు హైదరాబాదులో, మూడో టెస్టు మార్చి 14 నుంచి 18 వరకు మొహాలీలోను, నాలుగో టెస్టు మార్చి 22 నుంచి 26 వరకు ఢిల్లీలోను జరగనున్నాయి.

  • Loading...

More Telugu News