: గవర్నర్ పై నిప్పులు చెరిగిన వీహెచ్


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన హయాంలో అత్యంత నీతిమంతంగా పాలన కొనసాగిందని గవర్నర్ చెప్పిన నేపథ్యంలో వీహెచ్ నిప్పులు చెరిగారు. వందలాది రైతుల ఆత్మహత్యలు గవర్నర్ కు కనబడటం లేదా? అని ప్రశ్నించారు. రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను గవర్నర్ ఆదేశించలేకపోయారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో నిందితుడైన రేవంత్ రెడ్డిని గవర్నర్ మెచ్చుకోవడం ఏమిటని వీహెచ్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. తన పాలనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ గవర్నర్ లేఖ రాయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ పాలన ఎంత గొప్పగా సాగిందో సీబీఐ తేలుస్తుందని అన్నారు.

  • Loading...

More Telugu News