: నేతలను మించిన హెలికాప్టర్ల సందడి!


అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బీహారులో నేతల ప్రసంగాలను వినేందుకు వచ్చే వారి కన్నా, వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్లను తిలకించేందుకు వస్తున్న వారి సంఖ్యే అధికంగా ఉంది. అది నితీష్ కుమార్ గానీ, మాంఝీగానీ, ఉపేంద్ర కుశాహ్వగానీ, మరో నేత గానీ, హెలికాప్టర్ వస్తోందంటే, చాలు హెలిపాడ్ చుట్టూ వందల మంది చేరిపోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, పిల్లలు చాపర్ల చుట్టూ మూగిపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ, సాధ్యమైనంత ఎక్కువ ప్రాంతాన్ని చుట్టి రావాలని భావిస్తున్న నేతలు దాదాపు 20కి పైగా హెలికాప్టర్లను వాడుతున్నారు. వీటికి గంటకు రూ. 1.5 లక్షలు అద్దెగా ఉంది. ఇక రెండు ఇంజన్లున్న హెలికాప్టర్లకు వాటి కండిషన్ బట్టి రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షల అద్దె వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం హెలికాప్టర్లలో అత్యధికం బీజేపీ, దాని మిత్రపక్షాలు వాడుతుండగా, కాంగ్రెస్, జనతాదళ్, ఆర్జేడీలు రెండేసి చాపర్లను వాడుతున్నాయి. ఇక పప్పూ యాదవ్ ఒక హెలికాప్టర్ ను పూర్తిగా అద్దెకు తీసేసుకున్నారు. ఇవన్నీ ప్రతిరోజూ కనీసం మూడు నుంచి నాలుగు ప్రాంతాలకు నేతలను తీసుకెళ్తున్నాయి.

  • Loading...

More Telugu News