: అమరావతిలో ప్రజలకు అందించే 'మెనూ' మారింది


ఏపీ రాజధాని శంకుస్థాపనకు రానున్న ప్రజలకు అందించే మెనూలో మార్పులు జరిగాయి. తొలుత గారెలు, బూరెలతో భోజనం ఉంటుందనే సమాచారం వచ్చింది. అయితే, తాపేశ్వరం కాజా, చక్రపొంగలి, పులిహోర దద్దోజనం, మజ్జిగ ప్యాకెట్, రెండు మంచినీళ్ల ప్యాకెట్లు ఉన్న ఓ ప్యాక్ అందించాలని అధికారులు నిర్ణయించారు. ప్రజలు సభా ప్రాంగణంలోకి వచ్చే సమయంలోనే ఈ ప్యాక్ ను అందిస్తారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్యాకెట్లు పంపిణీ చేస్తే, తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని అధికారులు భావించారు. మరో వైపు 12 కంపార్టుమెంట్లుగా సభా ప్రాంగణాన్ని విభజించారు. ఒక్కో కంపార్ట్ మెంట్ కు ఒక జిల్లా స్థాయి అధికారి ఇన్ ఛార్జ్ గా ఉంటారు.

  • Loading...

More Telugu News