: ఉబెర్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు... తుది తీర్పు వెలువరించిన కోర్టు
ఉబెర్ క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్ ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. గత ఏడాది డిసెంబర్ 5న రాత్రి సమయంలో 25 ఏళ్ల ఓ మహిళా ఎగ్జిక్యూటివ్ పై శివకుమార్ అత్యాచారం చేశాడని కోర్టు తుది తీర్పు వెలువరించింది. శివకుమార్ పై మోపిన అభియోగాలన్నీ కోర్టులో నిరూపితం అయ్యాయి. ఈ నెల 23న అతడికి కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. ఈ కేసుకు సంబంధించి 44 మంది సాక్షులను విచారించారు. 100 పేజీల చార్జ్ షీట్ ను దాఖలు చేశారు.