: నాగార్జున యూనివర్శిటీకి తరలిన 19 రాష్ట్రాల నీరు, మట్టి
అమరావతి నిర్మాణంలో భాగంగా చేపట్టిన నీరు, మట్టి కార్యక్రమంలో భాగంగా 19 రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలు, నదులు, మహనీయుల జన్మస్థలాల నుంచి నీరు, మట్టిని తీసుకువచ్చారు. కాసేపటి క్రితం విజయవాడలోని స్వరాజ్ మైదానం నుంచి ప్రత్యేక వాహనాల్లో నాగార్జున యూనివర్శిటీకి వీటిని తరలించారు. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అశోక్ తోపాటు సుజనా చౌదరి, దేవినేని ఉమా, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కేశినేని నాని, నిమ్మల కిష్టప్ప, మాగంటి బాబు, గోకరాజు గంగరాజు తదితరులు పాల్గొన్నారు.