: పాక్ కామెంటేటర్లకు భద్రత ఇవ్వలేం... ఐదో వన్డేకు ముందే తిరిగి వెళ్లనున్న అక్రమ్, అఖ్తర్


ముంబైలో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగే ఆఖరి వన్డే పోరులో పాక్ మాజీ ఆటగాళ్లు, ప్రస్తుత కామెంటేటర్లు వసీం అక్రమ్, షోయబ్ అఖ్తర్ లు కనిపించబోరు. వీరికి భద్రత కల్పించలేమని, అవాంఛనీయ ఘటనలు జరగవచ్చని భద్రతా అధికారులు వెల్లడించడంతో, చెన్నైలో జరిగే నాలుగో వన్డే తరువాత వీరిద్దరూ స్వదేశానికి పయనం కానున్నారు. ఈ విషయాన్ని అక్రమ్ ఏజంట్ ఆర్సలన్ హైడర్ స్పష్టం చేశారు. ముంబై వన్డేకు రెండు రోజుల ముందుగానే 23న వీరు పాకిస్థాన్ కు ప్రయాణమవుతారని ఆయన తెలిపారు. కాగా, నిన్న శివసేన కార్యకర్తలు ముంబైలోని బీసీసీఐ కార్యాలయంపై దాడి చేసి పీసీబీ, బీసీసీఐ చర్చలను అడ్డుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటికే, చివరి రెండు వన్డేలకు పాక్ అంపైర్ అలీమ్ దార్ ను తప్పిస్తూ, ఐసీసీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News