: ‘ఫేస్ బుక్’పై దాడి... ఇజ్రాయెల్ కార్యాలయం ధ్వంసం
సోషల్ నెట్ వర్కింగ్ లో కొత్త ఒరవడికి నాంది పలికిన ‘ఫేస్ బుక్’పై దాడులు మొదలయ్యాయి. ఓ వర్గాన్ని కించపరుస్తూ ఫేస్ బుక్ లో ప్రత్యక్షమైన పోస్టులను తొలగించాలన్న డిమాండ్ ను పట్టించుకోని సదరు సంస్థ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ ఘటన ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లో చోటుచేసుకుంది. దాడిలో ఫేస్ బుక్ ఇజ్రాయెల్ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. యూదులు, ఇజ్రాయెలీలను చంపాలంటూ పోస్ట్ అయిన పేజీలను తొలంగిచాలన్న డిమాండ్ ను పట్టించుకోని కారణంగానే కొందరు దుండగులు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం.