: కానిస్టేబుల్ భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య


కానిస్టేబుల్ భర్త వరకట్న వేధింపులు తాళలేక ఒక మహిళ ఆత్మ చేసుకున్న సంఘటన సోమవారం హైదరాబాదు, చాంద్రాయణ గుట్టలో జరిగింది. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ప్రవీణ్ భార్య పూజ. వీరిది ప్రేమ వివాహం. ప్రవీణ్ కు పోలీసు ఉద్యోగం వచ్చిన తర్వాతే వారి వివాహానికి ఇరుకుటుంబాల పెద్దలు అంగీకరించడంతో వారి పెళ్లి జరిగింది. పెళ్లయిన కొత్తల్లో ప్రవీణ్ తన భార్యను బాగానే చూసుకునేవాడు. ఆ తర్వాత అతని నిజ స్వరూపం బయటపడింది. అదనపు కట్నం తేవాలంటూ ప్రతిరోజూ భార్యను వేధిస్తుండేవాడు. అయితే, పూజకు డైరీ రాసే అలవాటు ఉంది. భర్త వేధింపులను, తాను పడిన బాధను డైరీలో రాస్తుండేది. చివరికి భర్త వేధింపులను భరించలేక సీఆర్పీఎఫ్ క్వార్టర్స్ లో పూజ ఆత్మహత్య చేసుకుంది. పూజ డైరీ ద్వారా అసలు విషయం బయటపడటంతో, ప్రవీణ్ పై కేసు నమోదు చేయాలంటూ ఆమె కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News