: హిజ్రాలు, ట్రాన్స్‌జెండర్లు, బుడగ జంగాలకు క్లాసు పీకిన పోలీసులు
షాపుల వెంట తిరుగుతూ డబ్బులు అడుక్కోవడం, ఇవ్వకపోతే దాడులు చేయడం వంటివి చట్ట రీత్యా నేరమని.. కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హిజ్రాలు, ట్రాన్స్‌జెండర్లు, బుడగ జంగాలను పోలీసులు హెచ్చరించారు. హైదరాబాద్ లోని ఆల్వాల్ పీవీఆర్ గార్డెన్స్ లో పోలీసులు వారిని సమావేశపరిచారు. ఇందులో మల్కాజ్‌గిరి పీఎస్ పరిధిలో నివసించే హిజ్రాలు, ట్రాన్స్‌జెండర్లు, బుడగ జంగాల వారితోపాటు స్థానిక షాపుల నిర్వాహకులు పాల్గొన్నారు. తాము హిజ్రాలమని, తమకు ఎవరూ ఉద్యోగాలు ఇవ్వరని, పోషణకు అడుక్కోవడమే మార్గమని వారన్నారు. బుడగ జంగాలు కూడా తమలాగే వేషాలు వేసుకుని అడుక్కుంటున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా వేషాలు వేసుకుని అడుక్కోవడం తమ కులవృత్తి అని బుడగ జంగాల వారు చెప్పారు. ఈ సమావేశంలో డీసీపీ రమా రాజేశ్వరి, ఏసీపీలు సయ్యద్ రఫీక్, రవిచందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.