: పౌరసరఫరాల శాఖ కూలీలకు ‘చంద్రన్న’ దసరా కానుక


పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న కూలీలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దసరా కానుక ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ.3 వేలు, రెండు జతల బట్టలు, కేజీ స్వీట్లు పంపిణీ చేశారు. విజయవాడ గొల్లపూడి మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రన్న ప్రకటించిన దసరా కానుకను మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత, కిమిడి మృణాళిని చేతుల మీదుగా కూలీలకు అందజేశారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న కూలీలు ఆనందం వ్యక్తం చేశారు. తమకు దసరా కానుకను ఇచ్చిన నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News