: తెలుగు వారు తలచుకుంటే ఏదైనా సాధించగలరు: అశోక్ గజపతిరాజు
తెలుగు వారు తలచుకుంటే ఏదైనా సాధించగలరని కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. రాజధాని శంకుస్థాపన సభా ప్రాంగణాన్ని ఈరోజు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతి ప్రపంచ నగరాలకే మార్గదర్శనం అవుతుందని, కొత్తగా నిర్మించనున్న నగరాన్ని హరితనగరంగా అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. తెలుగువారి సంకల్పం చాలా గొప్పదని, వారు తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదన్నారు. రాజధానికి కేంద్రం నుంచి అందే సాయం కూడా వస్తుందని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. కాగా, అమరావతి శంకుస్థాపన పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. శంకుస్థాపన మహోత్సవంపై వంగపండు ప్రసాదరావు తన పాట ద్వారా హుషారెత్తిస్తున్నారు. రాజధానికి నాంది పలుకుతున్న క్షణాలు అపురూపమైనవని తన పాట ద్వారా వ్యక్తం చేస్తున్నారు.