: అమరావతి శంకుస్థాపనకు రామోజీరావును ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావును ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. రామోజీ ఫిలిం సిటీలోని రామోజీరావు నివాసానికి చంద్రబాబు ఈరోజు వెళ్లారు. రామోజీరావుకు శాలువా కప్పి స్వయంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ శంకుస్థాపన మహోత్సవానికి కుటుంబసమేతంగా హాజరుకావాలని బాబు కోరారు. కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ ను, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను నిన్న చంద్రబాబు కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు. అమరావతి శంకుస్థాసన మహోత్సవం తేదీ సమీపిస్తుండటంతో అతిథులకు ఆహ్వానపత్రాలు అందజేసే పనులు వేగవంతమయ్యాయి.