: ఇంద్రాణి ముఖర్జియా కస్టడీ పొడిగింపు


కన్న కూతురు షీనా బోరాను హత్య చేసిందన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జియా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు ఆమె తొలి భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ ల కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. అక్టోబర్ 31 వరకు కస్టడీని పొడిగిస్తున్నట్టు కోర్టు పేర్కొంది. షీనా బోరా 2012లో హత్యకు గురైంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తును సీబీఐ మరింత ముమ్మరం చేసింది.

  • Loading...

More Telugu News