: హిందూ దేవతల టాటూలు వేయించుకున్నందుకు ఆస్ట్రేలియన్ జంటను బెంగళూరులో చితగ్గొట్టిన స్థానికులు
హిందూ దేవతల చిత్రాలను ఒంటిపై పచ్చబొట్టుగా పొడిపించుకున్న ఆస్ట్రేలియన్ జంటను విచక్షణారహితంగా చావబాదారు ప్రజలు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు టూరిస్టులుగా వచ్చిన మాట్ కీత్ (21), అతని గర్ల్ ఫ్రెండ్ ఓ హోటల్ లో కూర్చుని ఉండగా, అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు, అతని కాలిపై పార్వతీ దేవి బొమ్మ, వీపుపై గణేష్ బొమ్మ టాటూ రూపంలో ఉండటాన్ని గమనించారు. అంతే, వారి కోపం నషాళానికి అంటింది. వారిపై మూకుమ్మడిగా దాడికి దిగారు. హిందూమతాన్ని వారు అవమానించారని ఆరోపించారు. తక్షణం టాటూ చెరిపేసుకోవాలని డిమాండ్ చేస్తూ, చితగ్గొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు సైతం తామేమీ చేయలేమని, వెంటనే టాటూ తొలగించుకోవాలని వారికి సలహా ఇవ్వడం గమనార్హం.