: హైదరాబాద్ లో ఉగ్రవాదులు ఉన్నారు... పోలీసుల విచారణలో మహిళా టెర్రరిస్టు నిక్కీ జోసెఫ్


ఐఎస్ఐఎస్ లో రిక్రూట్ మెంట్ కు దేశవ్యాప్తంగా తొమ్మిది మంది కీలక పాత్ర పోషిస్తున్నారంటూ ఇటీవల పట్టుబడ్డ మహిళా ఉగ్రవాది అప్సా జబీద్ నిక్కీ జోసెఫ్ సంచలన విషయాలను బయటపెట్టింది. హైదరాబాద్ లో కూడా స్లీపర్ సెల్స్ చురుగ్గా పనిచేస్తున్నాయని చెప్పింది. పోలీసుల విచారణలో పలు విషయాలను వెల్లడించింది. ఐఎస్ ప్రాబల్యం భారత్ లో ఏ విధంగా విస్తరిస్తుందో చెప్పింది. భారత్ లో తనతోపాటు 9 మంది ఐఎస్ రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నారని తెలిపింది. 9 మందిలో ఇద్దరు ముంబైకు చెందిన వారు కాగా మిగిలిన వారు హైదరాబాద్, బెంగళూరు, కాశ్మీర్ కు చెందిన వారని చెప్పింది. ఐఎస్ఐఎస్ కు సహకరిస్తున్న కొన్ని సంస్థల పేర్లను కూడా బయటపెట్టింది. నిక్కీ జోసెఫ్ యిచ్చిన సమాచారంతో ఐఎస్ రిక్రూటర్లపై ఇంటెలిజెన్స్ వర్గాలు గట్టి నిఘా పెట్టాయి. కాగా, ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధమున్న ఆరోపణలతో అప్సా జబీద్ ను గత నెలలో యూఏఈ ప్రభుత్వం భారత్ కు అప్పగించింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆమెను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News