: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి: మోదీకి రాహుల్ గాంధీ లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో నిర్ణయించిన సంగతిని లేఖలో గుర్తు చేశారు. అంతేకాకుండా, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీకి ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోవాలని రాహుల్ కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి ప్రత్యేక హోదా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.