: అమరావతి వేదికపై నుంచి మోదీ చేసే ప్రకటన కోసం ప్రజలు వేచి చూస్తున్నారు: రఘువీరా


విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్ కు అన్ని కేటాయింపులు జరగాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. శంకుస్థాపన కోసం వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ... అమరావతి వేదికపై నుంచి ఏపీకి సంబంధించి ఎలాంటి ప్రకటన చేస్తారో అని ప్రజలంతా వేచి చూస్తున్నారని అన్నారు. ఏపీకి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News