: కార్టూనిస్ట్ అంజన్ ను కలవడం సంతోషంగా ఉంది: సచిన్ టెండూల్కర్


‘దాదాపు 20 ఏళ్ల తర్వాత ప్రముఖ కార్టూనిస్ట్ అంజన్ సతీష్ ని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంజన్ సెరెబ్రల్ పాల్సీతో పోరాడి, అంగవైకల్యంతో పాటు పలు సవాళ్లను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ, అంజన్ కళాకారుడిగా రాణిస్తుండటం స్ఫూర్తిదాయకమైన విషయం’ అని మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అంజన్ తో కలిసి ఉన్న ఒక ఫొటోను కూడా సచిన్ పోస్ట్ చేశారు. కాగా, కేరళ లోని ఎర్నాకుళంలో 1987లో అంజన్ సతీష్ జన్మించాడు. అంజన్ కు అతని తల్లిదండ్రులు, సోదరుడి మద్దతు పూర్తి స్థాయిలో ఉంది. కేరళ కార్టూన్ అకాడమీ ‘కుట్టి కలాద్ కలామ్’ (చిల్డ్రన్స్ కలామ్) అనే అరుదైన పురస్కారంతో అంజన్ ను గౌరవించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News