: బీజేపీది హింస... మాది అహింస: దిగ్విజయ్


దేశాన్ని విడగొట్టే నైజంతో బీజేపీ ముందుకు సాగుతోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశమంతా ఐకమత్యంగానే ఉండాలని కోరుకుంటుందని చెప్పారు. బీజేపీ హింసను నమ్ముకుందని తాము మాత్రం అహింసనే నమ్ముతామని తెలిపారు. మన దేశంలో 40 శాతం మంది ప్రజలు మాత్రమే బీజేపీని అంగీకరిస్తున్నారని... మెజార్టీ జనం వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఈ రోజు హైదరాబాదులో జరిగిన రాజీవ్ సద్భావన యాత్రలో పాల్గొన్న ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News