: తెలుగునాట కందిపప్పు డబుల్ సెంచరీ!


నిన్న మొన్నటి వరకూ ఉల్లిపాయలు సాధారణ ప్రజలను కన్నీరు పెట్టిస్తే, ఇప్పుడు ఆ స్థానాన్ని కందిపప్పు ఆక్రమించింది. తెలుగు రాష్ట్రాల మార్కెట్లో కిలో నాణ్యమైన కందిపప్పు ధర రూ. 200 తాకింది. దీంతో పండగ నాడు పప్పన్నం తినే భాగ్యానికి ఎందరో పేద, దిగువ మద్య తరగతి ప్రజలు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది. తక్షణమే చౌక ధరల దుకాణాల ద్వారా కందిపప్పు అమ్మకాలు ప్రారంభించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, స్టాకిస్టులపై ఉన్న నిల్వ పరిధులను కేంద్రం తొలగించడంతోనే బహిరంగ మార్కెట్లో ఉన్న పప్పు ధాన్యాలు గోడౌన్లకు తరలి వెళ్లాయని, డీలర్లు కృత్రిమ కొరతను సృష్టించడం కూడా ధరల హైజంప్ కు కారణమని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News