: అమరావతికి వచ్చే సాధారణ ప్రజలకూ నోరూరించే వంటకాలతో 'మీల్స్ ప్యాక్'... మెనూ ఇదిగో!
నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చే సాధారణ ప్రజలు, రైతులకు సైతం నోరూరించే వంటకాలతో కూడిన భోజనాన్ని వడ్డించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. సుమారు లక్ష మంది వరకూ ఈ కార్యక్రమానికి వస్తారని భావిస్తూ, వారందరికీ సరిపడేలా ఏర్పాట్లు చేస్తోంది. బఫే రూపంలో కాకుండా, ముందుగానే ప్యాక్ చేసి పెట్టిన భోజనాన్ని అందించాలని కూడా నిర్ణయించింది. ఈ ప్యాక్ లో పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం, తాపేశ్వరం కాజా, అరటిపండు ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రముఖులకు, ముఖ్య అతిథులకు మాత్రం విడిగా మెనూ ఉంటుంది. భోజన ఏర్పాట్లను పలువురు మహిళా మంత్రులు దగ్గరుండి పరిశీలిస్తున్నారు.