: జగన్ ఎన్ని కుయుక్తులకు పాల్పడినా అమరావతి నిర్మాణం ఆగదు: ధూళిపాళ్ల
గుంటూరు జిల్లా పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఈ రోజు పొన్నూరులో 'మన మట్టి - మన నీరు' కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరావతి కోసం మట్టి, నీరు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ రాష్ట్రంలోనూ జగన్ లాంటి ప్రతిపక్ష నేత ఉండరని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని అభివృద్ధి పనులను జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి నిధులు, పర్యావరణ అనుమతులు రాకుండా జగన్ ఎన్ని కుయుక్తులకు పాల్పడినా అమరావతి నిర్మాణం ఆగదని ఆయన చెప్పారు. టీడీపీ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్న అక్కసుతోనే జగన్ ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు.