: గన్నవరం నూతన ఎయిర్ పోర్టు టెర్మినల్ కు శంకుస్థాపన


విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టులో నిర్మించనున్న నూతన టెర్మినల్ కు శంకుస్థాపన చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 9,525 అడుగుల్లో రూ. 135 కోట్ల వ్యయంతో ఈ టెర్మినల్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. మొత్తం నిధులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది. సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్, పబ్లిక్ అడ్రస్ సిస్టం, సీసీ టీవీ, వాచ్ వ్యవస్థ, ఫైర్ అలారం, ఫ్లయిట్ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లే సిస్టం, చెక్ ఇన్ కౌంటర్లు, కార్ పార్కింగ్ తదితర ఎన్నో సదుపాయాలు ఈ టెర్మినల్ లో ఉండబోతున్నాయి.

  • Loading...

More Telugu News