: బ్రిటన్ లో టీనేజర్ల పాస్ పోర్టులను బ్లాక్ చేసిన ప్రభుత్వం


బ్రిటన్ లోని 16, 17 ఏళ్ల టీనేజర్లు ఐఎస్ఐఎస్ వైపు ఆకర్షితులై సిరియాకు, ఆపై ఇరాక్ కు వెళ్లి ఉగ్రవాదుల్లో కలుస్తున్న సంఘటనలు పెరగడంతో దేశ ప్రధాని డేవిడ్ కామెరాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముస్లిం వర్గాలకు చెందిన టీనేజర్ల పాస్ పోర్టులను బ్లాక్ లో ఉంచుతున్నట్టు ప్రకటించారు. వీరెవ్వరినీ దేశం వీడి వెళ్లే విమానాలను ఎక్కనీయబోమని స్పష్టం చేశారు. "బ్రిటన్ యువతలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు విషాన్ని నింపుతున్నారు. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. భావి తరాలకు గొప్ప బ్రిటన్ దేశాన్ని అందించడమే మా లక్ష్యం" అని ఆయన తెలిపారు. తాము తీసుకున్న నిర్ణయం బ్రిటన్ విద్యార్థుల మేలు కోరేదేనని, తల్లిదండ్రులు, ప్రజా సంఘాలతో చర్చించిన మీదటే ఈ ప్రకటన చేస్తున్నామని వివరించారు. అత్యవసర ప్రయాణాలకు ఎటువంటి అడ్డంకులూ ఉండబోవని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News