: మా ఓటమికి కారణమిదే!: ధోనీ


270 పరుగుల అసాధ్యం కాని లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 18 పరుగుల తేడాతో ఓడిపోవడానికి పిచ్ స్వభావంలో అనూహ్య మార్పు రావడమే కారణమని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విశ్లేషించాడు. మ్యాచ్ గడిచేకొద్దీ పిచ్ స్లోగా మారడంతోనే తాము పరుగులు సాధించలేకపోయామని అన్నాడు. జట్టులో ఐదు, ఆరు, ఏడవ స్థానాల్లో మరింత మంచి ఆటగాళ్లు ఉండాల్సిన అవసరం ఉందని అన్నాడు. చివర్లో వికెట్లు త్వరగా కోల్పోవడం ఆటను దక్షిణాఫ్రికాకు అనుకూలంగా మార్చిందని తెలిపాడు. రన్ రేటు పెరగడంతో టెయిలెండర్లను ఒత్తిడిలోకి నెట్టిందని వివరించాడు. బ్యాటింగ్ కు, స్పిన్ బౌలింగ్ కు అనుకూలిస్తుందని భావించిన తమ అంచనా తప్పయిందని అన్నాడు. తదుపరి మ్యాచ్ లలో విజయం సాధించేందుకు కృషి చేస్తామని ధోనీ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News