: ముంబై బీసీసీఐ కార్యాలయంపై శివసేన దాడి


ముంబైలో శివసేన కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. పాకిస్థాన్ తో సిరీస్ నిర్వహించే ప్రయత్నాలు చేస్తామని అధ్యక్షుడు శశాంక్ మనోహర్ వ్యాఖ్యానించడాన్ని నిరసిస్తూ, వందలాది మంది కార్యకర్తలు ఈ ఉదయం ఒక్కసారిగా బీసీసీఐ ఆఫీసులోకి దూసుకెళ్లారు. అక్కడ వీరంగం సృష్టించారు. శశాంక్ మనోహర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ తో సిరీస్ కు అంగీకరించబోమని తెలిపారు. శివసేన ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో దక్షిణాఫ్రికాతో జరగనున్న ఆఖరి రెండు వన్డేలకూ జట్టు ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది.

  • Loading...

More Telugu News