: నేడు మూలా నక్షత్రం... పోలీసుల తీరుతో దుర్గగుడిపై మహిళల కన్నీరు


నేడు మూలా నక్షత్రం. సరస్వతీ దేవి జన్మనక్షత్రం. నవరాత్రి రోజుల్లో అమ్మలగన్న అమ్మ ఆ చదువుల తల్లి అలంకారంలో భక్తుల కోరికలు తీర్చేందుకు కొలువుదీరే శుభవేళ. ఆ తల్లిని దర్శించుకుందామని ఇంద్రకీలాద్రిపైకి తండోపతండాలుగా వచ్చిన భక్తులకు పోలీసుల తీరు చుక్కలు చూపించింది. మహిళలని కూడా చూడకుండా వారిని నెట్టి వేసిన తీరుకు పలువురు కన్నీరు పెట్టుకున్నారు. క్యూలైన్లలోని భక్తులు పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. దుర్గాఘాట్ లో స్నానం చేసేందుకు సైతం అనుమతించక పోవడంతో భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకు కావాల్సిన వారి వాహనాలను మాత్రమే కొండపైకి అనుమతిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మవారిని కనులారా దర్శించుకునేందుకు వచ్చిన తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని పలువురు మహిళలు మీడియా ముందు విలపించారు. కాగా, భక్తులు అత్యధిక సంఖ్యలో రావడంతో తొక్కిసలాటలు జరుగకుండా చూసే క్రమంలోనే భక్తులను ముందుకు వెళ్లద్దని చెప్పామే తప్ప, ఎవరిపైనా దురుసుగా ప్రవర్తించలేదని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News