: రైతు వేషంలో హార్దిక్ పటేల్... అయినా పట్టేసిన రాజ్ కోట్ పోలీసులు


గుజరాత్ పటేల్ సామాజిక వర్గానికి ఓబీసీ రిజర్వేషన్ల కోసం వినూత్న నిరసనకు దిగేందుకు యత్నించిన పాటిదార్ అనామత్ ఆందోళన సమితి నేత, యువ సంచలనం హార్దిక్ పటేల్ ను నిన్న పోలీసులు రాజ్ కోట్ స్టేడియం చేరకముందే అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే పోలీసుల కళ్లుగప్పి ఎలాగైనా భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ కు ఆటంకం కలిగించాలని కంకణం కట్టుకున్న హార్దిక్ పటేల్, అందుకోసం వేషం మార్చారు. తలకు పాగా చుట్టుకుని అచ్చూ రైతు మాదిరిగా అతడు స్టేడియానికి బయలుదేరారు. అయితే దీనిపై ముందుగానే సమాచారం ఉన్న పోలీసులు రైతు వేషంలోని హార్దిక్ తో పాటు ఆయన మిత్ర బృందాన్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సందర్భంగా హార్దిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఓ సాధారణ ప్రేక్షకుడిలాగే మ్యాచ్ కు వెళుతున్నానని, టికెట్లు కూడా తన వద్ద ఉన్నాయని ఆయన పోలీసులకు చెప్పారు. అయినా వినని పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News