: ముంబైలో ఘనంగా బంగారు బతుకమ్మ వేడుకలు
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ముంబైలో తొలిసారిగా బతుకమ్మ ఉత్సవాలు జరిగాయి. ఈ వేడుకలను కాంగర్ స్టేడియంలో నిర్వహించారు. మహిళలతో కలిసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే సతీమణి లక్ష్మీథాక్రే ఉల్లాసంగా బతుకమ్మ ఆడారు. పూలతో పేర్చిన అందమైన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ, లయబద్ధంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా బతుకమ్మ పాత్ర ఉందని అన్నారు. ఉద్యమ పోరాటంలో దాని పాత్రను మర్చిపోలేమన్నారు. ఈ వేడుకల్లో రంగారెడ్డి జెడ్పీ ఛైర్మన్ సునీతా మహేందర్‌రెడ్డి, ముంబై మేయర్ స్నేహా అంబేకర్, ముంబై వెస్ట్ ఎంపీ అరవింద్ సావంత్, బాంద్రా, వర్లీ ఎమ్మెల్యేలు, పూణె, థానే, షిర్డీ నుంచి వచ్చిన మహిళలు, యువతులు పాల్గొన్నారు.