: తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడవాహనంపై శ్రీవారి ఊరేగింపు జరిగింది. ఈ వేడుకను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఆనందంతో పరవశించారు. గోవింద నామస్మరణతో తిరువీధులు మార్మోగిపోయాయి. ఏడుకొండల వాడి నామస్మరణతో భక్తులు తాదాత్మ్యం చెందారు. శ్రీవారి వాహనసేవ సందర్భంగా తిరువీధుల్లో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శ్రీవారి గరుడసేవలో ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ప్రభుత్వ విప్ మల్లికార్జునరెడ్డి, పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు పాల్గొన్నారు.