: లక్ష్యం దిశగా సాగుతున్న భారత్
మూడో వన్డేలో 271 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా లక్ష్యం దిశగా కొనసాగుతోంది. 30 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(45), మహేంద్ర సింగ్ ధోని (21) క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు రోహిత్ శర్మ(65) రెండో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. మరో ఓపెనర్ శిఖర్ ధవన్(13) నిరాశపరిచాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. కాగా, రబడ బౌలింగ్ లో దూకుడుగా ఆడకుండా ఓన్లీ సింగిల్స్ తో ముందుకెళ్తున్నారు. రబడ తన ప్రత్యేకమైన బౌలింగ్ తో పరుగులను నియంత్రిస్తున్నాడు.