: ఎనిమిది నెలల తర్వాత ఇద్దరు చంద్రులు కలుసుకున్నారు!
సుమారు 8 నెలల తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ కలుసుకున్నారు. ఓటుకు నోటు కేసు వెలుగుచూడటంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య దూరం పెరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్, చంద్రబాబు కలుసుకోవడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 22న గుంటూరులో ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. కాగా, ఆమధ్య ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులలో ఏపీ, తెలంగాణ సీఎంలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న సంగతి విదితమే!