: చంద్రబాబుతో పాటు కేసీఆర్ నివాసానికి వెళ్లిన రమణ, ఎర్రబెల్లి
అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించేందుకని సీఎం కేసీఆర్ అధికారిక నివాసానికి వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సాదర స్వాగతం లభించింది. తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిలు చంద్రబాబును ఆహ్వానించారు. చంద్రబాబుతో పాటు కేసీఆర్ నివాసానికి వెళ్లిన వారిలో టీటీడీపీ నేతలు రమణ, ఎర్రబెల్లి దయాకరరావు ఉన్నారు. సుమారు 20 నిమిషాల నుంచి ఇద్దరు చంద్రుల సమావేశం కొనసాగుతోంది. అమరావతికి సంబంధించిన అంశాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అమరావతి శంకుస్థాపన, నిర్మాణాలు మొదలైన అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.