: దక్షిణాఫ్రికా 270/7


మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 271 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు డీ కాక్, డేవిడ్ మిల్లర్ లు శుభారంభం అందించారు. దక్షిణాఫ్రికా 39 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులతో భారీ స్కోరు దిశగా వెళుతున్నట్లు కనిపించినా.. చివరి 11 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 65 పరుగులు మాత్రమే చేసింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డు ప్లెసిస్(60; 63 బంతుల్లో 6 ఫోర్లు), బెహర్దియన్ (33 నాటౌట్) ఆకట్టుకోవడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. గత రెండు వన్డేల్లో విఫలమైన మిల్లర్ (33) ఈమ్యాచ్ లో ఫర్వాలేదనిపించాడు. మరో ఓపెనర్ డీ కాక్ సెంచరీతో చెలరేగాడు. టీమిండియా బౌలర్లలో మోహిత్ శర్మకు రెండు వికెట్లు, హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ లకు తలో వికెట్ దక్కింది.

  • Loading...

More Telugu News