: చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్ కల్యాణ్... 'అన్నయ్య'కు అభినందనలు తెలిపిన 'తమ్ముడు'!


మెగాస్టార్ చిరంజీవిని, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ను పవన్ కల్యాణ్ అభినందించాడు. 'బ్రూస్ లీ' చిత్రం సక్సెస్ అయిన సందర్భంగా పవన్ వారికి శుభాభినందనలు తెలిపాడు. ఈ రోజు తన అన్నయ్య నివాసానికి పవన్ వెళ్లారు. బ్రూస్ లీ చిత్రంలో చిరంజీవి గెస్ట్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన అన్నయ్యకు అభినందనలు తెలిపారు. కాగా, రాజకీయాల్లోకి ప్రవేశించిన అనంతరం సినిమాలకు చిరంజీవి దూరంగా ఉండటం తెలిసిందే. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత ‘చిరు’ కొంచెం సేపు మాత్రమే కనపడే పాత్రలో నటించిన చిత్రం బ్రూస్ లీ. ఇటీవల చిరంజీవి 60వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ని పవన్ కలుసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత చిరంజీవిని పవన్ కలసింది ఈరోజే. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత పవన్ కల్యాణ్, చిరంజీవి మధ్య చాలా గ్యాప్ ఏర్పడిన సంగతి తెలిసిందే. దాంతో, ఈ కలయికకు రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఏర్పడింది.

  • Loading...

More Telugu News