: గవర్నర్, టీ సీఎంను ఆహ్వానించనున్న చంద్రబాబు
తెలుగురాష్ట్రాల గవర్నర్ నరసింహన్, టీ ముఖ్యమంత్రి కేసీఆర్ లను ఆహ్వానించేందుకు తిరుమల నుంచి హైదరాబాద్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించే నిమిత్తం ఈరోజు సాయంత్రం చంద్రబాబు వారితో భేటీ కానున్నారు. గవర్నర్, సీఎంలకు ఆహ్వాన పత్రికలను అందజేసి ఈ కార్యక్రమానికి రావాలంటూ సాదర పూర్వకంగా బాబు ఆహ్వానించనున్నారు. కాగా, చంద్రబాబు మనవడి అన్నప్రాసన నిమిత్తం ఈ రోజు ఉదయం తిరుమలలో ఉన్నారు. కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి ఆయన హైదరాబాద్ కు బయలుదేరారు.